నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-24
టీజీఎస్ ఆర్టీసీ బోధన్ డిపో మేనేజర్ గా విశ్వనాథ్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆసిఫాబాద్ డిపో నుండి బోధన్ కు బదిలీపై వచ్చిన డిపో మేనేజర్ విశ్వనాథ్ నేడు బాద్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన శ్రీనివాస్ కరీంనగర్ – 2 డిపోకు బదిలీ అనే విషయం తెలిసిందే. ఈ మేరకు నూతన డిపో మేనేజర్ విశ్వనాథ్ ను బోధన్ డిపో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు.