నిజమాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ :24 (షేక్ గౌస్)
సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ప్రసంగిస్తూ, తెలంగాణలో బెట్టింగ్ యాప్ మాఫియా విస్తృతంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.యువత ఈజీ మనీ ఆశతో బెట్టింగ్ యాప్‌ల వలలో పడిపోతూ డబ్బు కోల్పోయి ఆర్థికంగా, మానసికంగా కుంగిపోతున్నారని, కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు.ఇటీవల ఓ మీడియా సంస్థ ఒక మాజీ మంత్రి ప్రమేయంతో ఈ యాప్‌ల నిర్వహణ జరుగుతోందని కథనం ప్రచురించిందని, దీనిపై ప్రభుత్వం దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. దోషులను గుర్తించి ముఖ్యంగా యాప్ ఓనర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.GHMC మాదిరిగా ఆస్తిపన్ను వడ్డీ మాఫీ అందించాలి GHMC OTS (వన్ టైం సెటిల్‌మెంట్) ద్వారా ఆస్తిపన్ను బకాయిలపై 50% వడ్డీ మాఫీ కల్పించి, ప్రిన్సిపల్ + మిగతా 50% వడ్డీ చెల్లిస్తే పూర్తిగా పరిష్కరించుకునే అవకాశాన్ని కల్పించిందని తెలిపారు.ఈ విధానాన్ని తెలంగాణలోని 13 మునిసిపల్ కార్పొరేషన్లకు కూడా వర్తింపజేయాలని, నిజామాబాద్ వంటి కార్పొరేషన్లకు కూడా వడ్డీ మాఫీ వెసులుబాటు కల్పించాలని ఎమ్మెల్యే ధన్ పాల్ ప్రభుత్వాన్ని కోరారు.