నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ :23 (షేక్ గౌస్)
డోంకేశ్వర్ మండల కేంద్రంలో త్వరలో ప్రారంభం కానున్న కొత్త గ్రంథాలయాన్ని గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజా రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అభివృద్ధి, పాఠకులకు అందించాల్సిన సౌకర్యాలు, పుస్తకాల పఠన ప్రాముఖ్యతపై చర్చించారు. గ్రామ ప్రజలు, విద్యార్థులు ఈ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుని పఠన సంస్కృతిని పెంచుకోవాలని సూచించారు.గ్రంథాలయ మంజురికి కృషి చేసిన ఆర్మూర్ నియోజక ఇన్చార్జి వినయ్ రెడ్డి కి, మంజూరు చేసిన ఛైర్మెన్ రాజా రెడ్డి కి మండల ప్రజల తరపున భూమేష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
ఆయనతో పాటు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూమేశ్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోక హన్మంద్లు, చందు, బాపు రావు తదితరులు పాల్గొన్నారు.