తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 13:
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై అహర్నిశలు కష్టపడే కార్యకర్తలకి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని నమ్మకాన్ని కలిగిస్తూ గురువారం తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ జిల్లాల వారీగా యువజన కాంగ్రెస్ ఇన్చార్జిలుగా నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. అందులో భాగంగా నిర్మల్ జిల్లా యువజన కాంగ్రెస్ ఇన్చార్జిగా విగ్నేష్ యాదవును నియమిస్తూ నియామక పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి సురభి, ఖలీద్, రాష్ట్ర అధ్యక్షులు శివ చరణ్ రెడ్డి ఇలా చేతుల మీదుగా నియామక పత్రాన్ని విగ్నేష్ యాదవ్ అందుకున్నారు. అందుకు తనపై నమ్మకం ఉంచి బాధ్యతలను అప్పగించినందుకు గాను పార్టీ పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతున్నానని విగ్నేష్ యాదవ్ (విక్కీ యాదవ్) నమ్మకంతో బాధ్యతలను అప్పగించినట్లే అహర్నిశలు యువజన కాంగ్రెస్ పార్టీ కోసం నిర్మల్ జిల్లాలో పార్టీ పటిష్టనికై శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. అంతకుముందు యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న విగ్నేష్ యాదవ్ నిర్మల్ జిల్లా ఇన్చార్జి యువజన కాంగ్రెస్ బాధ్యతలను చేపట్టడం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తూ విక్కీ యాదవ్ అన్నకి శుభాకాంక్షలు అంటూ సామాజిక మాధ్యమాలలో తమ ఆనందాన్ని తెలియజేశారు.