పసుపు రైతులు ఆందోళనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 11:
నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా ?
గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది ?

మాటలు చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు క్వింటాలు పసుపుకు 15 వేల ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు పసుపు కు కనీసం 9 వేలు రాని పరిస్థితి ఉంది అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకోకపోవడం దారుణం ఇది రైతులను నయవంచన చేయడమే, మోసం చేయడమే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 15 వేల మద్దతు ధర చెల్లిస్తూ పసుపు పంటను కొనుగోలు చేయాలి  పసుపు బోర్డు తీసుకొచ్చామని చెబుతున్న బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదు పసుపు బోర్డుకు చట్టబద్ధత లేకపోవడంతో రైతులకు ప్రయోజనాలు కలగడం లేదు పసుపుకు ధరలు పెంచుతామని, మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో బండి సంజయ్ చెప్పారు కానీ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి పసుపు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!