నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 7. (షేక్ గౌస్)
అనాధ పిల్లలకు అన్నదానం…రక్తదాన శిబిరం –
బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

సిద్ధుల గుట్ట ఆలయంలో ప్రత్యేక పూజలు
ఆర్మూర్ పట్టణంలోని సిద్ధుల గుట్ట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, జీవన్ రెడ్డి యొక్క ఆరోగ్యవంతమైన జీవితం కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రార్థనలు చేశారు.మామిడిపల్లిలోని తపస్వీ స్వచ్ఛంద సేవా సంస్థ లో బి ఆర్ ఎస్ కార్యకర్తలు అనాధ పిల్లలకు అన్నదానం నిర్వహించారు. అనంతరం పిల్లలతో కలిసి జన్మదిన వేడుకలు జరిపి, వారికి స్వీట్లు, బహుమతులు అందజేశారు.జిల్లా యువజన నాయకుడు అభిలాష్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేసరు.బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం లో నాయకులు కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దాదన్నగారి విఠల్ రావు, నగర మాజీ మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ శేఖర్, కోత్తూర్ లక్ష్మారెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, సిర్ప రాజు, చింత మహేష్, యువజన నాయకుడు అభిలాష్ రెడ్డి, తదితరులు పాల్గొని జన్మదిన వేడుకలను విజయవంతంగా నిర్వహించారు.