నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి.25
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కే ద్రం లోని రాజ్ నగర్ దుబ్బా ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో స్లాబ్ మెట్ల పై నుంచి కాలుజారి పడిపోవడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.నందిపేట ఎస్ ఐ చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం, నందిపేట రాజ్ నగర్ దుబ్బా కాలనికి చెందిన గొల్ల చిన్న ముత్యం (25) లేబర్ వృత్తి తో జీవనం గడిపే అతను ఫిబ్రవరి 24వ రాత్రి 9:00 గంటల సమయంలో కళ్ళు బట్టిలో మద్యం సేవించిన తర్వాత, మరింత మద్యం కోసం లిక్కర్ బాటిల్‌తో సమీపంలోని ఓ స్లాబ్ భవనం పైకి ఎక్కాడు. అయితే అకస్మాత్తుగా మెట్లపై నుంచి కాలుజారి పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడి అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిపేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఎస్ ఐ తెలిపారు