నిరుద్యోగులు పక్షాన నిలబడతా… పట్టభద్రుల  ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బ గోని అశోక్ గౌడ్..

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 25.
ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బ గోని అశోక్ గౌడ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెట్పల్లి కోరుట్ల జగిత్యాల్ తదితర పట్టణాలలో ప్రైవేటు స్కూళ్లలో , మరియు ప్రైవేటు కళాశాలలో పర్యటించడం జరిగిందని ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బగోని అశోక్ గౌడ్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రచారంలో భాగంగా ప్రైవేట్ టీచర్లను మరియు ప్రైవేటు సంస్థలు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను కలిసి వారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగిందని అబ్బ గోని అశోక్ గౌడ్ తెలియజేశారు. ఈ మేరకు అశోక్ గౌడ్ మాట్లాడుతూ..నిరుద్యోగులకు, ప్రైవేట్ టీచర్లకు, ఇతర ప్రైవేట్ రంగాలలో పని చేస్తున్నటువంటి పట్టభద్రుల కొరకు ప్రశ్నించే గొంతు గా మారుతానని తెలియజేశారు. తనను గెలిపిస్తే శాసనమండలిలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రైవేట్ టీచర్ల సమక్షంలో మాట్లాడుతూ తెలియజేశారు..తనను ఎమ్మెల్సీగా గెలిపించి శాసనమండలికి నిరుద్యోగుల పక్షాన నిలబడతానని ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బగోని అశోక్ గౌడ్ తెలియజేశారు. అనేక చదువులు చదువుకొని పల్లెలలో ఉపాధి దొరకక దినసరి వేతనం కింద కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మరికొందరు పట్టబద్రులు ఉపాధి నిమిత్తం పట్టణాలకు వెళ్లే పరిస్థితి నెలకొన్నదని తెలియజేశారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులకు సంబంధించినటువంటి యూనివర్సిటీ ఇంతవరకు లేకపోవడం దీనిపైన తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు. ఉమ్మడి కరీంనగర్, మెదక్ , ఆదిలాబాద్ ,నిజామాబాద్ జిల్లాలలో ఉన్నటువంటి నిరుద్యోగులు వాళ్ల చదువు తగినట్టు సొంత జిల్లాలలో ఉపాధి లేకపోవడంతో హైదరాబాద్ బెంగుళూరు ముంబై కలకత్తా తదితర దూర ప్రాంతాలకు వలస వెళ్లి ఉపాధి చూసుకుంటున్నారు. అదేవిధంగా మరికొందరు అబ్రాడ్ దేశాలకు వెళ్లి ఉపాధి వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా దుబాయ్, మస్కట్, అబుదాబి, సౌదీ అరేబియా, ఇరాక్, ఆఫ్గనిస్తాన్, వంటి ఇస్లామిక్ దేశాలకు వెళ్లి అక్కడ కూలీల పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. మరికొందరు చదువు నిమిత్తం కొరకు అని యూరప్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇజ్రాయిల్ వంటి దేశాలలో ఆంగ్లేయుల వద్ద పనిచేస్తున్నారు , వారి బాధలు ఎవరికి చెప్పుకోలేక చాలామంది సతమతమవుతున్నారని, కచ్చితంగా నిరుద్యోగ సమస్యను తీర్చే విధంగా వారికి సరైనటువంటి చదువు నిమిత్తము ఉపాధి దొరికే విధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించే విధంగా వారికి వెన్నంటే తోడు ఉంటానని అబ్బగోని అశోక్ గౌడ్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు సూరినిడ దశరథ్, తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు బెజ్జరం అంబదాస్, తెలంగాణ బిసి గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎల్లోల్ల సురేష్, తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం నాయకులు రాజుల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!