మెదక్, ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘ సభ్యులు.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక సోమవారం ఫిబ్రవరి 17.
మెదక్ నిజాంబాద్ కరీంనగర్ అదిలాబాద్ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలంగాణ ఉద్యమ నాయకుడు బీసీ ఉద్యమ నాయకుడు, నిరుద్యోగుల కోసం నిరంతరం పోరాడే వ్యక్తి అబ్బగోని అశోక్ గౌడ్ ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం సభ్యులు తెలియజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నిజాంబాద్ జిల్లా స్పోక్స్ పర్సన్ (అధికార ప్రతినిధి) సూరి నీడ భాస్కర్ మాట్లాడుతూ.. అగ్రవర్ణాల పార్టీలు బిజెపి మరియు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా అగ్రవర్ణాలకు చెందినటువంటి అంజిరెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త , అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గార్లు ఎన్నడూ కూడా నిరుద్యోగుల పక్షాన గాని బీసీల పక్షాన గాని మాట్లాడిన దాఖలాలు లేవని ప్రశ్నించారు. అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్ పార్టీ ఆశావాహి అందులో పార్టీ టికెట్ రాకపోవడం వల్ల బీఎస్పీ నుంచి పోటీ చేయడం జరుగుతుందని ప్రసన్న హరికృష్ణ ఎన్నడూ కూడా బీఎస్పీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ప్రకటించకపోవడం పట్ల బీసీ నాయకులు ఆలోచించాలని సూర్యుని భాస్కర్ ఒకవేళ ప్రసన్నర కృష్ణ గెలిస్తే ఖచ్చితంగా అగ్రవర్ణాల పాటులకు వెలుగుతారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.బీసీలకు సముచిత న్యాయం జరగాలంటే కేవలం మన బీసీ నాయకులను గెలిపించుకోవాలని అందులో భాగంగా అబ్బగోని అశోక్ గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా బీసీల కోసం పూర్తిస్థాయిగా ఎన్నో ఉద్యమాలు చేపట్టారని అంకిత భావితం తోని పని చేశారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి సూరినిడ భాస్కర్ తెలిపారు.అదేవిధంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు బెజ్జారం అంబదాస్ మాట్లాడుతూ.. బహుజనులకు మరియు నిరుద్యోగులు న్యాయం జరగాలంటే కేవలం వారి పట్ల ఉన్నటువంటి అవగాహన కలిగిన వ్యక్తితోనే సముచిత న్యాయం జరుగుతుందని దానికి ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్నటువంటి స్వతంత్ర అభ్యర్థి అబ్బగోని అశోక్ గౌడ్ ని గెలిపించుకోవాలని బీసీ సంఘాలకు పిలుపునిచ్చారు.ఈ క్రమంలో అన్ని బీసీ సంఘాలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కొప్పు మధు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు జీవన్ గౌడ్, రాజుల కృష్ణ, ఎల్లొల్ల సురేష్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!