పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆసక్తికర పోటీ

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 31.
క్లాస్‌మేట్ లే రాజకీయ ప్రత్యర్థులుగా కానున్నారా ?
రాజారం యాదవ్ vs డి ఏస్పీ గంగాధర్.

తెలంగాణలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. రాజకీయ సమీకరణాలు మారిపోతుండటంతో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య కఠినమైన పోటీ నెలకొననుంది. అయితే, ఈ ఎన్నికలో ప్రత్యేకంగా చర్చనీయాంశమవుతోన్న మరో అంశం రాజకీయ జోస్యాలు నిజం అయి కాంగ్రెస్ నుండి డీఎస్పీ గంగాధర్ కు బి ఆర్ ఎస్ నుంచి విద్యార్తి ఉద్యమ నాయకుడు రాజారాం యాదవ్ కు టికెట్ లు ఖరారు అయితే జరుగబోయే పోటీ ఇద్దరు క్లాస్మేట్ ల మధ్యన ఉంటుంది.

రాజకీయ ప్రత్యర్థులుగా తలపడనున్న ఇద్దరు క్లాస్‌మేట్స్.

తెలంగాణ ఉద్యమ కాలంలో విద్యార్థి నాయకుడిగా ఎదిగిన రాజారం యాదవ్ ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగనున్నారని ఊహాగానం జరుగుతోంది. మరోవైపు, డీఎస్పీగా పదవీ విరమణ చేసిన మదనం గంగాధర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. వీరిద్దరూ ఒకప్పుడు స్నేహితులు, క్లాస్‌మేట్స్ కాగా, ఇప్పుడు రాజకీయంగా ఒకరినొకరు ఎదుర్కొనాల్సిన పరిస్థితి వచ్చింది.

బీఆర్ఎస్ అభ్యర్థిగా రాజారం యాదవ్?

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన రాజారం యాదవ్, ఉస్మానియా విశ్వవిద్యాలయ జేఏసీ నేతగా విద్యార్థి లోకంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై పోటీ చేసిన అనుభవం ఆయనకు ఉంది.

బీసీ వర్గానికి చెందిన రాజారం యాదవ్‌కు యాదవ్ సామాజిక వర్గంలో పట్టు ఉండటంతో పాటు పట్టభద్రుల వర్గంలో బలమైన మద్దతు ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్ఠానం ఆయనను అభ్యర్థిగా ప్రకటించబోతుందనే ప్రచారం ఊపందుకుంది.

కాంగ్రెస్ అభ్యర్థి గా డీఎస్పీ గంగాధరు డేన ?

పోలీస్ అధికారిగా వివిధ హోదాల్లో పనిచేసిన మదనం గంగాధర్, తాజాగా తన డీఎస్పీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ పోటీకి సిద్ధమవుతున్నారు. చిన్నతనంలో అనేక కష్టాలు అనుభవించిన గంగాధర్, పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదిగారు. ప్రజలకు చేరువగా ఉండే అధికారి అనే పేరుతో గంగాధర్‌కు సామాన్య జనాల్లో మంచి గుర్తింపు ఉంది.కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డికి టికెట్ దక్కకపోతే, మదనం గంగాధర్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. టికెట్ లభించకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ఆయన సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.

మూడో స్థానంలో బీజేపీ..?

ఈ ఎన్నిక ప్రధానంగా బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్యే జరుగుతుందని విశ్లేషకుల అంచనా. బీజేపీ మూడో స్థానంలో నిలిచే అవకాశముంది. ఇప్పటికే బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. సంగారెడ్డికి చెందిన అంజిరెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీగా, కొమురయ్య టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ బరిలోకి దింపింది. అయితే పట్టభద్రుల వర్గంలో బీజేపీ బలహీనంగా ఉండటంతో ప్రధాన పోటీ బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్యే జరగనుంది ఒక వేళ గంగాధర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే వీరి మధ్య త్రిముఖ పోటీ ఉండనుంది.

కఠినమైన పోటీ – ఎవరిదే విజయమవుతుందో?

ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక తీవ్ర ఉత్కంఠ తో సాగనుంది. అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తుండగా, ఒకప్పుడు ఒకే క్లాస్‌మేట్స్‌గా ఉన్న రాజారం యాదవ్, మదనం గంగాధర్ ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడుతుండటంతో ఈ పోటీ మరింత రసవత్తరంగా మారింది.ఎన్నికల ప్రచారం ఇంకా ముమ్మరం కానున్న నేపథ్యంలో చివరికి ఏవరిది పైచేయి సాధిస్తుందో చూడాలి!

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!