తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 28.
సోమవారం రాత్రి హైదరాబాద్ లో నిర్వహించిన జెసిఐ ఇండియా అలుమ్ని క్లబ్ జోన్ 12 సమావేశంలో విజయానంద్ వైస్ చైర్మెన్ గా ప్రమాణస్వీకారం చేశారు.
2025 సంవత్సరానికి గాను జోన్ చైర్మన్ డీవీఎస్పి గుప్త జిల్కార్ విజయానంద్ తో వైస్ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేయించారు.జెసిఐలో 2011 నుండి 2020 వరకు చేసిన సేవలను గుర్తించి విజయానంద్ కు అలుమ్ని క్లబ్ వైస్ చైర్మెన్ గా నియమించారు..అలుమ్ని క్లబ్ లో తనకు స్థానం దక్కడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా విజయానంద్ పేర్కొన్నారు..తనకు సహకరించిన జేసిఐ ఇందూర్ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.అలుమ్ని క్లబ్ జోన్ 12 సమావేశంలో అతిథులుగా జెసిఐ ఇండియా అలుమ్ని క్లబ్ జాతీయ అధ్యక్షురాలు అంజలి గుప్త బాత్ర, జాతీయ అధికారులు సునీల్ కుమార్, మనోజ్ టక్కర్, కమల్ కుమార్ , కిరణ్ బంటు హాజరయ్యారు.జోన్ జెసిఐ అధ్యక్షులు చతుర్వేది , వైస్ చైర్మన్ లు నవీన్ చవళ్ళ, శ్రీనివాస్ వీరబొమ్మ, సురేందర్ రెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్,కోశాధికారి శ్యంసుందర్, డైరెక్టర్ చంద్రశేఖర్ , ఇందూర్ సభ్యులు లావణ్య , పద్మ శ్రీనివాస్ , ఆనంద్ సోమని కార్యక్రమంలో పాల్గొన్నారు .