తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 16.
రూ 5000 లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రవి.
బుధవారం ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సుంకె విష్ణు తన భూమి మార్ట్ గేజ్ కోసం ఇటీవల సబ్ రిజిస్ట్రార్ అసీఫొద్దీన్ ను సంప్రదించాడు.భూమి మార్ట్గేజ్ చేసేందుకు 10 వేల రూపాయలు ఇవ్వాలని రవి డిమాండ్ చేయగా చివరకు రూ. 5000 ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది.ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రవికి 5000 రూపాయలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని సబ్ రిజిస్టార్ అసీఫోద్దీన్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి రవి తో డాక్యుమెంట్ రైటర్ రవి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు. తెలిపారు..