నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 10.
డొంకేశ్వర్ మండలంలోని మారంపల్లి గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ నిర్వహించారు. ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్చార్జ్ పొద్దుటూరు వినయ్ రెడ్డి కృషి ద్వారా మంజూరైన చెక్కులను మండల అధ్యక్షుడు గుడిసెరం భూమేష్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా భూమేష్ రెడ్డి మాట్లాడుతూ, “సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల అవసరాలను తీర్చడంలో ముందు ఉందన్నారు. ఫ్రీ బస్ సర్వీసులు, ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా మహిళలు సంతోషంగా జీవిస్తున్నారు” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.