నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30.
ఆర్మూర్ పట్టణంలోని నవనాథ పురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలోజర్నలిస్టుకు ఆర్థిక సహాయాన్ని నవనాతపురం ప్రెస్ అధ్యక్షులు మంచిర్యాల నరేందర్ అందజేశారు . పట్టణంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన అయ్యేడి సురేష్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురికాగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.పేర్కిట్ గ్రామానికి చెందిన జక్కం రమణయ్య అనారోగ్యానికి గురికావడంతో ఆయనను ప్రెస్ క్లబ్ సభ్యులు పరామర్శించి ధైర్యాన్ని చెప్పరు. జర్నలిస్టుల సంక్షేమానికి నవనాథ పురం¹ ప్రెస్ క్లబ్ ముందుంటుందని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మంచిర్యాల నరేందర్ అన్నారు. జర్నలిస్టులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా సభ్యులు ముందుండి ఆదుకుంటామని చెప్పారు. ఈ ఆర్థిక సహాయం అందించేందుకు తోడ్పాటున అందించిన జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మంచిర్యాల నరేందర్, ఉపాధ్యక్షులు ముద్ర కోల వినోద్ కుమార్ , టి యు డబ్ల్యూ జె ఐ జె యు జిల్లా ఉపాధ్యక్షులు పర్దేం సంజీవ్, సాత్పుతే శ్రీనివాస్, రాజేందర్ , దినేష్ , కోసూరు మైపాల్, చరణ్ గౌడ్, మరియాల వెంకటేశం, విన్సెంట్, గటాడి అరుణ్, నితీష్ తదితరులు పాల్గొన్నారు.