డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68 వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బగొని అశోక్ గౌడ్

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 6.

తెలంగాణ బిసి గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బ గోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 – 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. అతను స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి అని తెలియజేశారు. ఓటు హక్కు అని నినాదంతో రాజ్యాధికారాన్ని సాధించుకోవచ్చునని డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు తెలియజేశారని, అతని ఆశయాలను కొనసాగిస్తామని అబ్బగోని అశోక్ గౌడ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎలుక జీవన్ గౌడ్ , కుమ్మరి రాజు, సాయిలు, కృష్ణ తదితరులు , నాయకులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!