తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 1.
మెదక్ జిల్లా చేగుంట లో 5వ తేది నాడు చెగుంట లోని ప్రభుత్వ జూనియర్ కాలేజి గ్రౌండ్లో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి రగ్బీ సెలెక్షన్ లో మెదక్ జిల్లాకు సెలెక్ట్ అయిన క్రీడాకారులతో నవంబర్ 30, డిసెంబర్ 1,2 వ తేదీలలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లోని స్టేడియం గ్రౌండ్ లో జరిగే యస్.జి. ఎఫ్ అండర్ 14 రాష్ర్ట స్థాయి పోటీలకు మెదక్ జిల్లా జట్టు తరలి వెళ్ళడం జరుగుతుందని కొచ్ కరణం గణేష్ రవికుమార్ తెలిపారు.గత సంవత్సరం మెదక్ జిల్లా బాలికల జట్టు ద్వితీయ స్థానం సాధించగా,బాలుర జట్టు తృతీయ స్థానం సాధించిందని ఆయన తెలిపారు.అండర్ 14 బాలికల జట్టులో లాస్య,కావ్య,ప్రవస్వీ,దేవి,కల్పన,విలక్షణ,శ్రావణ భార్గవి, నివేదిత,సాహితీ,శ్రావణి,అనురాధ,ఆశ్విత బాలుర విభాగంలో బాలు,కార్తీక్,దీక్షిత్,లక్ష్మణ్,నవదీప్,నందు,సాయితేజ,గణేష్,సాయి నయన్, శ్రీరామ్,శివకుమార్,నమృత్,టీమ్ కోచ్ లుగా మల్లీశ్వరి,శ్రీనాథ్ టీమ్ మేనేజర్లు గా ప్రవీణ్,నర్సింలు వ్యవహరిస్తున్నారని కరణం గణేష్ రవికుమార్ తెలిపారు.