తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 22.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని భారాస నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.బోనస్ మాట బోగస్ అయిందని.. మద్దతు ధర కూడా రావట్లేదన్నారు. ఖమ్మంలో మీడియాతో ఆయన మాట్లాడారు.పత్తిలో ప్రతి క్వింటాకు రైతుకు రూ.1500 నష్టం వాటిల్లుతోంది. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం, కుట్రలు చేయడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది జీరో. వరి, పత్తి పంట దళారుల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? రైతుబంధు, మద్దతు ధర లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పత్తికి గరిష్ఠంగా రూ.11 వేలు, కనిష్ఠంగా రూ.9 వేల ధర పలికింది. ఇప్పుడు ఎందుకు ధర తగ్గింది? పత్తి రైతులకు మద్దతు ధర రావాలి.. రూ.500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రా దళారులు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ మాటలకు తేడా ఉంటోంది. ఖమ్మం జిల్లా మంత్రులు ఆధిపత్యం కోసం బాగా బిజీ అయ్యారు. ప్రజాసమస్యలను గాలికొదిలి గొప్పలకు పోతున్నారు’’ అని హరీశ్‌రావు విమర్శించారు.
రైతులకు మద్దతు ధర లేదు.బోనస్ బోగస్ అయింది. హరీశ్‌రావు ఖమ్మంలో మీడియా సమావేశం
Published On: November 22, 2024 1:00 pm
