తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 21.
ఈరోజు గాంధీభవన్లో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు పై జుక్కల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫిర్యాదు చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను పట్టించుకోవడంలేదని నియోజకవర్గంలోని ఎనిమిది మండలంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు హైదరాబాద్లో గాంధీభవన్ కి వెళ్లి టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్కు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను కాకుండా టిఆర్ఎస్ బిజెపి వాళ్లను వెంటేసుకుని తిరుగుతున్నాడని మమ్మల్ని పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాలుగా నుండి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి మేము గెలిపిస్తే ఆయన నామినేటెడ్ పదవులువేరే వారికి ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సౌదాగర్ అరవింద్, కమల్ సెట్, వినోద్, సంగమేశ్వర, జయ ప్రదీప్, అన్ని మండలాల సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.