జగిత్యాల జిల్లాలో పోగుల లత న్యాయ పోరాట కమిటి ఏర్పాటు 

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జయభారత్ న్యూస్ నవంబర్ 18.

ఇటీవల వరకట్నపు హత్యకు గురైన “పోగుల లత పేరుతో న్యాయ పోరాట కమిటీని” ఏర్పాటు చేసినట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన పోగుల లత నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం రేవోజీపేట గ్రామంలో హత్యకు గురి అయిన విషయం అందరికీ తెలిసిందే.ఇకనుండైనా ఇలాంటి వరకట్నపు హత్యలు, వేధింపులు, హింసలు జరుగ కూడదని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు ఏకమై ఈ కమిటీని నియామకం చేయడం జరిగింది.పోగుల లత న్యాయ పోరాట కమిటి కన్వీనర్ గా ఐద్వా జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి గా పని చేస్తున్న వెల్గొండ పద్మ ను నియమించారు. చైతన్య మహిళా సంఘం ప్రతినిధులు కే.శ్రీదేవి, వొటార్కర్ శ్రీదేవి, హక్కుల సంఘాల ప్రతినిధులు అయిన అరిగెల పద్మ, పుల్ల సుచరిత, సుశీల తో పాటు మృతురాలి తల్లి పోగుల మల్లేశ్వరి లను కో – కన్వీనర్లు గా నియమించారు. ఈ కమిటి పోగుల లత న్యాయ పోరాట కమిటి గా పని చేస్తూ, ఆమె హత్య పట్ల చట్టపరంగా సరైన న్యాయం జరిగేంత వరకు ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. త్వరలో సరైన ప్రణాళికతో కార్యాచరణ ప్రారంభం చేస్తామని ప్రకటించారు. జగిత్యాల జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో వరకట్నపు హత్యలు, హింసలు, వేధింపులు, మహిళలపై గృహ హింసలు, దాడులు జరుగకుండా ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని ఈ కమిటీతో పాటు హాజరైన ప్రజా సంఘాల ప్రతి నిధులు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!