నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 17.
బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన కే.సౌందర్య గుండె సంబంధిత అనారోగ్యంతో బాధ పడుతున్నది.చికిత్స చేయించుకోవడానికి స్థానిక ప్రజాప్రతినిధులు ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో గుండె ఆపరేషన్ కొరకు 2.50 లక్షల రూపాయల LOC మంజూరు చేయించారు….ఎల్ఓసి కాపీ ని సంబంధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఈ రోజు హైదరాబాద్ లో అందజేశారు. నిరుపేదలమైన మాకు గుండె ఆపరేషన్ కొరకు 2.50 లక్షల LOC ఎమ్మెల్యే మంజూరు చేశారని, ప్రశాంత్ రెడ్డి గారి మేలు మర్చి పోలేమని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా తెలియజేసారు.