సేవా సంగ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 15.

నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం లో నెహ్రూ యువ కేంద్రం మరియు సేవా సంగ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ కార్యక్రమంలో భాగంగా జన జాతీయ గౌరవ దివాస్ ను భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం నాయకుడు నరేష్ రాథోడ్ పాల్గొని ముందుగా బిట్స్ ముండా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ స్వతంత్ర పోరాటంలో గిరిజనులకు నాయకత్వం వహించినటువంటి వాళ్లలో ముఖ్యుడు బిర్సా ముండా బ్రిటిషర్లు వాళ్లు గిరిజన అటవీ భూమి ఆక్రమించుకోవడానికి చేసినటువంటి చట్టాలను వ్యతిరేకంగా పోరాటం చేసి వీరుడు తాను జీవించి ఉన్న 25 సంవత్సరాల కాలంలోనే నేడు భగవాన్ బిర్సా ముండా అని పిలుచుకునే స్థాయికి ఎదిగారు కావున నేటి యువతరం వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర మాజీ వాలెంటర్ సునీల్ రాథోడ్ మాట్లాడుతూ భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో నేలకొరిగిన గిరిజన నాయకులను స్మరించుకుంటూ భారత ప్రభుత్వం 2021 నుంచి జన్ జాతీయ గౌరవ దివాస్ గా నవంబర్ 15న బిర్సా ముండా జయంతి సందర్భంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చింది .బిర్సా ముండా ఫోటోను భారత పార్లమెంట్ ఎగ్జిబిషన్ హాల్లో పెట్టడం ద్వారా ఆయన ఎంతగొప్ప సేవా చేసి ఉంటేనే ఆయన ఫోటోను అక్కడ పెట్టి ఉంటారో నేటి గిరిజన యువత ఆలోచించాలి వారి లాగా మీరు కూడా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మాధవరావు వైస్ ప్రిన్సిపాల్ రాహుల్, ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!