తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్
మహారాష్ట్ర దళిత ఉద్యమానికీ ఆజ్యం పోసిన ప్రఖ్యాత వాగ్గేయకారుడైన దివంగత విఠల్ ఉమప్ గారొకరు. అయితే వారి కుమారుడు సందీప్ ఉమప్ తో గురువారం సాయంత్రం తెలుగువారు ముంబై దాదర్లోని ఓ కార్యక్రమంలో కలిశారు. ఇందులో “ఆద్ర సేవా ఫౌండేషన్” కు చెందిన బోగ హరికిషన్ పద్మశాలి, బందారపు రమేష్, కొమరయ్య రజక్, ఎంటిబిఎఫ్ కన్వీనర్ చౌవల్ రమేష్, మూలనివాసి మాలజీ ఉన్నారు. అయితే మహారాష్ట్ర దళిత ఉద్యమానికి గొప్ప సాంస్కృతిక నేపథ్యం వుందన్నది విధితమే. ఆనాడు “కళాకారుడి ఒక్క పాట నా వంద ఉపన్యాసాలతో సమానం” అంటూ పోల్చాడు అంబేడ్కర్. ఆ కాలంలో విఠల్ గారి “జాంబుల్ ఆఖ్యాన్” లఘు నాటిక మహారాష్ట్రలో ప్రభంజనం సృష్టించింది. పలు సినిమాల్లో పాటలు పాడారు. ఆయన 27 సెప్టెంబర్ 2010 దసరా రోజున నాగపూర్ “దీక్షభూమి” స్టేజిపై లక్షల జన సమక్షంలో “జైభీం జై జైభీం” నినాదాలు ఇస్తూ తుదిశ్వాస విడిచారు. ఆ రోజుల్లో ఆ ఘటన దళిత లోకంలో ఓ సంచలనంగా మారింది. నేడు సందీప్ ఆయన వారసత్వాన్ని లోకగీత్ – భీంగీత్ హిందీ మరాఠీ భాషల్లో నిరంతరం ప్రజల మధ్య మరియు స్టేజిలపై ఆలపిస్తున్నారు. మరాఠీ నేలపై అంబేడ్కరైట్ ఉద్యమంలో పాటలను ఆయుధంలా మల్చుకునే నైపుణ్యం కళాకారులకు ఉంది. ఆయన ప్రస్తుతం పీడిత జనాన్ని రాజ్యాధికార కాంక్ష వైపు చైతన్య పర్చే సాహిత్య కళాలలో ఉన్నారు.