ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని PDSU విద్యార్థుల ర్యాలీ

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 12. డిచ్పల్లి మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలను పెంచాలని, డిచ్పల్లి మండల కేంద్రంలోని బాలుర,బాలికల మరియు డిగ్రీ కళాశాలకు సొంత భవనాలను నిర్మించాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిచ్పల్లి మండల కేంద్రంలో PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గన్ పూర్ గ్రామపంచాయతీ నుండి రైల్వే స్టేషన్ వరకు విద్యార్థుల ర్యాలీ నిర్వహించి, నిరసన తెలపడం జరిగింది.

ఈ సందర్భంగా
*పి.డి.ఎస్.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ*
స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థుల పట్ల కనికరం చూపని కాంగ్రెస్ రేవంత్ వైఖరిని ఖండించారు.
రియంబర్స్మెంట్ రాక, ఫీజులు కట్టే స్తోమత లేక ఉన్నత చదువులకు ఇబ్బందుల దృష్ట్యా కొందరు పేరెంట్స్ అప్పులు తెచ్చి కాలేజీ ఫీజులు కడుతున్నారన్నారు. మెజారిటీ నిరుపేద విద్యార్థులు ఫీజులు చెల్లించలేక, సర్టిఫికెట్లు కాలేజీలోనే వదిలేసి పైచదువులు ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రభుత్వం స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు.
ఫీజు బకాయిలు చెల్లించకపోవడం విద్యార్థులపై సర్కారుకు వున్న వివక్షకు నిదర్శనమన్నారు.
ఇప్పటికైనా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ మెస్ చార్జీల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పెరిగిన ధరల దృష్ట్యా విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందలేక ప్రభుత్వ హాస్టళ్ళ విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని, తక్షణమే పాత బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా డిచ్పల్లి మండల కేంద్రంలోని బాలుర,బాలికల కళాశాల వసతిగృహాలకు, మరియు డిగ్రీ కళాశాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. వెంటనే విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలను తీవ్రతరం చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో PDSU డిచ్పల్లి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివకుమార్, రాజేష్ PDSU నాయకులు సృజన్,రాజేశ్వర్,బన్నీ,కార్తీక్,అక్షయ విద్యార్థులు పాల్గొన్నారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!