తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ హైదరాబాద్ నవంబర్ 4
బేడ బుడగ జంగం సమాజానికి సేవలు చేసేందుకు తన ఉద్యోగం అడ్డు వస్తుందని.బేడ బుడగ జంగం కులానికి సమాజం పట్ల సరైన నాయకత్వం లేకపోవడం వల్ల తాను ఎంతో కలత చెంది ఇక పూర్తిస్థాయి కుల సేవకు, సమాజ సేవకు తన వంతు సేవలు అందించాలని డీఎస్పీ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేశారు,ఆంధకారంలో ఉన్న బేడ బుడగ జంగం సమాజానికి జ్ఞానవంతమైన సమాజం వైపు అడుగులు వేపించే ఆలోచన విధానంతో తన డిఎస్పి ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయి కుల సేవకు రావడం ఎంతో సాహసోపేతమైన నిర్ణయం.ఇట్టి నిర్ణయాన్ని గౌరవిస్తూ ప్రస్తుత తరుణంలో మధనం గంగాధర్ కి తెలంగాణ రాష్ట్ర బేడ బుడగ జంగం యూత్ అసోసియేషన్ తరపున పూర్తిస్థాయి మద్దతు తెలియజేస్తూ రాబోయే తరాలకు మార్గదర్శకంగా నాయకత్వాన్ని తయారు చేసే విషయంలో మదనం గంగాధర్ వెంట సైన్యంలా పని చేస్తామని తన ఆలోచనలను, తన లక్ష్యాలను అధిరోహించే క్రమంలో తన వెన్నంటూ ఉంటామని తెలిపారు.