నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 3 న చలో ఢిల్లీ జయప్రదం చేయాలని స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ నాడు ఆయన లేకుంటే నేడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదు అందుకని “కరెన్సీ పై అంబేడ్కర్ ఫోటో సాధన సమితి” జాతీయ అధ్యక్షులు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ అన్నారు. సోమవారం నిజాంబాద్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించగా ఈ సందర్భంగా పరశురామ్ మాట్లాడుతూ 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పకూలినప్పుడు 1923లో బాబాసాహెబ్ గారు సగటు మనిషి వ్యక్తి కోణంలో నుంచి ఆర్థిక కోణాన్ని దృష్టిలో ఉంచుకొని “రూపాయి దాని సమస్య పరిష్కార మార్గం” అనే పుస్తకాన్ని రాసి హిల్టాన్ యాంగ్ కమిషన్, రాయల్ కమిషన్, సైమన్ కమిషన్ కు ఇవ్వడం వల్ల ఇది వాస్తవం అని గ్రహించి 1935 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు జరిగిందంటే అది కేవలం అంబేడ్కర్ కృషి వల్లనే జరిగింది. అందుకే కరెన్సీ నోట్లపై భీంరావు ఫోటోను ముద్రించాలని ఢిల్లీలో డిసెంబర్ 3, 4, 5తేదీలలో ఢిల్లీ జంతర్ మంతర్ లో మహాధర్నా చేపట్టడం జరుగుతుందని, ఐతే అట్టి ధర్నాను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మీట్ లో “సమితి” సలహాదారులు ముంబై నేత మూలనివాసి మాలజీ, చక్రాల నాగమణి పద్మశాలి, పి.స్వప్న, కాపు శంకరవ్వ, ఎ.వై.ఎస్ జిల్లా అధ్యక్షులు డి.ఎల్ మాలజీ, మహానాడు జిల్లా అధ్యక్షులు సక్కి విజయకుమార్, ఎ.వై.ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు సౌడ జయరాజు, జిన్నా జనార్ధన్, మున్నూరు కాపు సంఘం నేత కళ్లెం భోజన్న, జిన్నా జనార్దన్, భీంఆర్మీ నేత ఎస్.గంగప్రసాద్ రజక, జాంభవ చమార్, సతీష్ మహారాజ్, జర్నలిస్ట్ మామిడి రాజు పాల్గొన్నారు.
కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి
Published On: November 4, 2024 10:35 pm
