నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 20 : ప్రజలు అపత్కాలంలో అదుకునేందుకు ఉద్ధేశించిన డయల్ 100 ను మిస్ యూస్ చేసిన వ్యక్తికి న్యాయస్థానం నాలుగు రోజుల జైలు శిక్ష విధించింది. ఎస్ ఐ సుహాసిని కథనా ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి మెండోరా మండలం గ్రామానికి చెందిన సందేశ్ బాబు అనే వ్యక్తి నిత్యం మద్యం సేవించి స్థానికంగా న్యూసెన్స్ చేసేవాడు. అంతే గాకుండా డయల్ 100 కు పదే పదే కాల్ చేసి మీస్ యుస్ చేయడంతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ 4 రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్ ఐ సుహాసిని తెలిపారు. ఎవరైనా పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ అయిన డయల్ 100 ను మిస్ యూస్ చేసినట్లయితే వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్ ఐ సుహాసిని తెలిపారు.
డయల్ 100 మిస్ యూస్ చేసిన వ్యక్తి కి 4 రోజుల జైలు శిక్ష.
Updated On: November 20, 2025 5:02 pm









