నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే :1 ( షేక్ గౌస్)
ఆర్మూర్‌లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ (టిమ్రీస్) గర్ల్స్ పాఠశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి ఫలితాలలో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 54 మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా, వారందరూ ఉత్తీర్ణులయ్యారని ప్రిన్సిపాల్ నాహిదా ఫీర్దోస్ తెలిపారు.600లో 500కి పైగా మార్కులు సాధించిన విద్యార్థినులు 34 మంది ఉన్నారు. హారిక 571 మార్కులతో ప్రథమ స్థానం, లయ 563 మార్కులతో ద్వితీయ స్థానం, నవీన 555 మార్కులతో తృతీయ స్థానం సాధించారు. అభిషేక మరియు అక్షయ తదితరులు కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు.