తెలంగాణ అమర వీరులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి 

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా.

తెలంగాణ ఉద్యమంలో తన గలం కలంతో ప్రజలను చైతన్య పరిచిన అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం స్వాగతిస్తున్నాం.

గత ప్రభుత్వంలో అర్బన్ నియోజకవర్గంలో అర్హులైన ఒక్కరికి కూడా ప్రభుత్వ భూమి ఇళ్ల స్థలాలు అందివ్వని చేతగాని ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం.

జై భారత్ దినపత్రిక తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జనవరి 03 : (నవీన్ కుమార్) తెలంగాణ అమరవీరులకు ఇచ్చిన అన్ని హామీలు కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో అమలు చేయాలని నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. శనివారం హైదరాబాదులో అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ తన గలం కలంతో ప్రజలను చైతన్య పరుస్తూ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రత్యేక కృషి చేసినరని ఆయన అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అందెశ్రీ మృతి చెందిన తర్వాత ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2001 నుండి 2014 వరకు 1200 మంది అమర వీరులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, వారికి న్యాయం చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా నేపథ్యంలో అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారో సభాముఖంగా చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. రత్నం పనిలేని వాళ్ళు చేసుకున్న అమర వీరులకు నెలకు 25 వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు ఎంతమందికి ఇచ్చారు కూడా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలన్నారు. అమరవీరుల కోసం న్యాయం చేస్తామన్న గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం అమరవీరుల నుండి తీసుకున్న దరఖాస్తులు కాగితాలకే పరిమితమయ్య న్నారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో పదేళ్ల కాలంలో అర్బన్ నియోజకవర్గ పరిధిలో అర్హులైన ఒక్క లబ్ధిదారుడికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. పేరుకు మాత్రమే నగర శివారులో డబుల్ బెడ్రూంలు నిర్మించారు తప్ప అధికారికంగా లబ్ధిదారులకు ఇవ్వలేదని దీంతో ప్రస్తుతం అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ అసెంబ్లీలో సభా దృష్టికి తీసుకువచ్చారు ఇప్పటివరకు 50% కూడా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వని పరిస్థితి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ఆయన అన్నారు. 10 ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో ఒక్క నిరుపేదలకు కూడా ఇళ్లస్థలాలు అందివ్వలేదని, 280 ఇళ్ల స్థలాలు 80 శాతం మాత్రమే పూర్తి అయ్యాయని, 360 ఇళ్ల స్థలాల కోసం 1.25 కోట్లు నిధులు మంజూరు అయ్యాయని అవి లబ్ధిదారులకు కేటాయించాలని అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment