నిజామాబాద్ నార్త్ తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న జె.రాహుల్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెండ్ చేశారు. రెవెన్యూ రికార్డుల పహాణీల లో అక్రమ మార్పులు చేయడం, రికార్డుల తారుమారు, విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు.
నిజామాబాద్ నార్త్ మండలం పరిధిలోని కంటేశ్వర్ ప్రాంతంలో సర్వే నంబర్లు 291/ఏ, 291ఏఏ, 292లకు సంబంధించిన రెవెన్యూ వచ్చిన ఆరోపణలపై కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రాథమిక విచారణ జరిపించారు. ఈ విచారణలో రెవెన్యూ రికార్డుల టాంపరింగ్ వాస్తవమేనని వెల్లడైంది.
విచారణ నివేదిక ఆధారంగా, రికార్డు అసిస్టెంట్ జే.రాహుల్ ను సస్పెండ్ చేయడంతో పాటు శాఖాపరంగా సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ అనంతరం సమగ్ర నివేదికను అనుసరిస్తూరికార్డుల్లో టాంపరింగ్ జరిగినట్లు తదుపరి చర్యలు ఉంటాయని, రెవెన్యూ రికార్డులను తారుమారు చేయడం, విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.











