బాల్కొండలో రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా అర్హులకు అన్యాయం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత లోపించిందని, తహసిల్దార్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఎంఏ. షాహిద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
బాల్కొండలో రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిజమైన అర్హులకు అవి అందకుండా పోయాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగిన ఈ పంపిణీ కార్యక్రమంలో, బాల్కొండ గ్రామ పాలకవర్గం మరియు రాజకీయ పార్టీల నాయకులు కలిసి లబ్ధిదారుల ఎంపిక సరిగా జరగలేదని అధికారులకు ఎంత చెప్పినా వినకుండా, తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని విమర్శించారు. తహసిల్దార్ కార్యాలయం చేసుకున్న ఎంపిక దారుల పేర్లను మాత్రమే లక్కీ డ్రాలో వేసి, తీయడం జరిగిందని, అసలైన అర్హులు నిరాశ వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ పద్ధతిని గ్రామ పాలకవర్గం, రాజకీయ పార్టీల నాయకులు వ్యతిరేకించినా అధికారులు పట్టించుకోలేదని సమాచారం. దీనివల్ల అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై మండల మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఎంఏ. షాహిద్ తీవ్రంగా మండిపడ్డారు. అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందని, పారదర్శకత పాటించకుండా కొందరికే లబ్ధి చేకూర్చేలా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని, అర్హులందరికీ న్యాయం జరిగేలా చూడాలని ఆయన అధికారులను కోరారు.












