హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో పట్టపగలు ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఐటీ కారిడార్‌లో క్యాబ్ ఎక్కుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి యువతిని పక్కకు లాగి బలవంతంగా ముద్దు పెట్టుకున్న ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన 24 ఏళ్ల యువతి గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ వసతి గృహంలో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. మంగళవారం ఉదయం సుమారు 10.30 గంటలకు ఆమె కార్యాలయానికి వెళ్లేందుకు క్యాబ్ ఎక్కుతుండగా ఈ ఘటన జరిగింది.
అందరూ చూస్తుండగానే యువతిని పక్కకు లాగి నిందితుడు ముద్దు పెట్టడంతో ఆమె షాక్‌కు గురై గట్టిగా కేకలు వేసింది. దీంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం స్థానికుల సహాయంతో బాధితురాలు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని గుర్తించారు. జార్ఖండ్‌కు చెందిన రాజ్‌కుమార్ హైదరాబాద్‌కు వచ్చి ఇందిరానగర్‌లోని ఓ దాబాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం.
ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం.












