ఆర్మూర్, 2026-07-28
తయేసణయం(SIR)ొూఎయే,ఎయూేషఫంంఅధఅంే.ూ,తంణంూతసచేసఅధఅంంచయ.
ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం (SIR)లో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తమ ఓటు వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నింపి, సంబంధిత అధికారులకు అందజేశారు.
ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలతో పాటు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తమ ఓటు వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో సక్రమంగా నింపి, సంబంధిత అధికారులకు సకాలంలో అందజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొని, తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జీవన్ రెడ్డి గారు కోరారు.












