సిరికొండ, 2026-06-05
పెద్దవాల్గొట్ నుంచి న్యావనంది చౌరస్తా వరకు గుంతలమయంగా మారిన రహదారికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. దీంతో చిన్నవాల్గొట్ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కొంతవరకు తొలగిపోయాయి. భారీ వర్షాల కారణంగా కొండూరు బ్రిడ్జి దెబ్బతినడంతో ఈ రహదారి ప్రత్యామ్నాయ మార్గంగా మారింది.
పెద్దవాల్గొట్ నుంచి న్యావనంది చౌరస్తా వరకు గుంతలమయంగా మారిన రహదారికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రయాణానికి అనువుగా చేశారు. దీంతో చాలా రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్నవాల్గొట్ గ్రామ ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. గత 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు కొండూరు బ్రిడ్జి దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో ఈ రహదారే మండల ప్రజలకు ప్రధాన ప్రత్యామ్నాయ మార్గంగా మారింది. అయితే పెద్దవాల్గొట్ నుంచి న్యావనంది చౌరస్తా వరకు రహదారిపై భారీగా గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఎమ్మెల్యే చొరవతో మరమ్మతులు
ఆగస్టు మొదటి వారంలో సిరికొండ మండల పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి దృష్టికి ప్రజాప్రతినిధులు ఈ రహదారి సమస్యను తీసుకెళ్లారు. సమస్యపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి తాత్కాలిక మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు.
కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్
సరైన సమయంలో స్పందించి రహదారి మరమ్మతులు చేయించిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డికి చిన్నవాల్గొట్ గ్రామ సర్పంచ్ దడివే గణేష్, పాలకవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రహదారికి శాశ్వత పరిష్కారం చూపించి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని వారు కోరారు.












