నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 7 మండలాల మహిళా సమాఖ్యలకు రాష్ట్ర ప్రభుత్వం 7 ఆర్టీసీ బస్సులను అందజేయనుంది.
మంగళవారం ఉదయం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలు 7 బస్సుల్లో హైదరాబాద్ కు బయలుదేరారు. ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి పచ్చ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబన సాధించేందుకు 6 లక్షల రూపాయలు, మహిళా సంఘాల కాంట్రిబ్యూషన్ ద్వారా 30 లక్షల రూపాయలు మరియు బ్యాంకు లింకేజీ ద్వారా వడ్డీలేని రుణాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
మహిళలకు వడ్డీలేని రుణాలు అందించడం, మహిళలు తయారు చేసే వస్తువులకు మార్కెటింగ్ కల్పించడం కోసం హైదరాబాద్ శిల్పారామంలో ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ నాయకులు మరియు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.








