Bhimgal, 2026-06-05
భీంగల్ పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై పూర్తిస్థాయి నిషేధం అమల్లోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ డి గజానంద్ తెలిపారు. ఈ నిషేధాన్ని ఉల్లంఘించి సింగిల్ యూస్ ప్లాస్టిక్‌ను వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

వ్యాపార సముదాయాలకు సూచనలు
భీంగల్ పట్టణంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కిరాణా షాపులు, పండ్లు, కూరగాయలు, మాంసం విక్రయించే దుకాణాలతో సహా అన్ని రకాల వ్యాపార సముదాయాల యజమానులకు ఈ విషయం తెలియజేయడమైనది. వారు సింగిల్ యూస్ ప్లాస్టిక్‌ను వినియోగించరాదని స్పష్టం చేశారు.
జరిమానాలు, చట్టపరమైన చర్యలు
ఒకవేళ సింగిల్ యూస్ ప్లాస్టిక్‌ను వినియోగిస్తే, మున్సిపల్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి, జరిమానాలు విధించడంతోపాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ గజానంద్ తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.