Bhimgal, 2026-06-05
భీంగల్ మండల మాజీ జెడ్పీటీసీ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు చౌట్పల్లి రవి తండ్రి మరణించారు. ఆయన అంత్యక్రియల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని, నివాళులర్పించారు.
భీంగల్ మండల మాజీ జెడ్పీటీసీ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు చౌట్పల్లి రవి తండ్రి ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం చౌట్పల్లి రవి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు.

