భారతదేశం ఇటీవల కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు () తెలంగాణ పసుపు రైతులు, , ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి శ్రీమతి ఎన్. భవానీ శ్రీ, ఐఏఎస్ తెలిపారు. పసుపు ఉత్పత్తుల నాణ్యత పెంపు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, అంతర్జాతీయ మార్కెట్ అనుసంధానం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు బోర్డు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని ఆమె వివరించారు.
హైదరాబాద్లో కేంద్ర వాణిజ్య శాఖ, అదనపు డీజీఎఫ్టీ కార్యాలయం, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ సంయుక్తంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి మెగా అవుట్రీచ్ కార్యక్రమంలో భవానీ శ్రీ ఈ విషయాలు వెల్లడించారు.
పసుపు నాణ్యత పెంపునకు శిక్షణ
పసుపు రైతులకు మెరుగైన వ్యవసాయ పద్ధతులు, నాణ్యత ప్రమాణాలు, అంతర్జాతీయ ఎగుమతులకు అవసరమైన ప్రమాణాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను బోర్డు నిర్వహిస్తోందని తెలిపారు. పంట కోత అనంతరం పసుపు ఉడకబెట్టడం, ఎండబెట్టడం, నిల్వ, ప్రాసెసింగ్ వంటి అంశాల్లో ఆధునిక పద్ధతులను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు.
అర్హులైన రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు () పంట కోత అనంతర యంత్రాల కొనుగోలుకు సబ్సిడీ రూపంలో సహకారం అందించే కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా ఆరు కొనుగోలుదారులువిక్రేతల సమావేశాలు
పసుపు రైతులు, లు, ప్రాసెసర్లు, ఎగుమతిదారులు, కొనుగోలుదారుల మధ్య ప్రత్యక్ష మార్కెట్ సంబంధాలను బలోపేతం చేసేందుకు వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా ఆరు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు భవానీ శ్రీ వెల్లడించారు. ఈ సమావేశాల ద్వారా రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు, వ్యాపార సంబంధాలు కల్పించనున్నట్లు తెలిపారు.
లు, స్టార్టప్లకు ప్రత్యేక ప్రోత్సాహం
పసుపు ఆధారిత విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, వినూత్న ఆవిష్కరణలు, పారిశ్రామిక అవకాశాలను ప్రోత్సహించేందుకు - సహకారంతో రానున్న నెలల్లో స్టార్టప్ కాన్క్లేవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే, లకు అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మెరుగైన ప్యాకేజింగ్, ఉత్పత్తుల ప్రదర్శన, నాణ్యత ప్రమాణాలు, మార్కెట్ అవసరాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు.
దేశీయ, అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలు, ప్రచార కార్యక్రమాల్లో పసుపు ఎగుమతిదారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొనేందుకు జాతీయ పసుపు బోర్డు సహకారం అందిస్తోందని తెలిపారు. భారతీయ పసుపు, పసుపుతో తయారైన విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు పరిచయం చేయడం ద్వారా ఎగుమతులను విస్తరించవచ్చని పేర్కొన్నారు.
భారతదేశం కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా లభించే ప్రాధాన్యతా సుంకాల ప్రయోజనాలను పసుపు ఎగుమతిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలు, ఉత్పత్తి ధృవీకరణ, ప్యాకేజింగ్, ఎగుమతి నిబంధనలపై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు.












