Headlines:
-
నిర్మల్ ఆర్టీసీ డిపోలో ఆరోగ్య పరీక్షల గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్
-
ఆర్టీసీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణలో డిపోమేనేజర్ ప్రతిమా రెడ్డి ఆరాటం
-
ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్ సొలొమాన్ సందర్శనలో హెల్త్ చెకప్ క్యాంప్
ఈ నెల 24 నుండి 29 వరకు నిర్మల్ డిపోలో డిపోమేనేజర్ ప్రతిమా రెడ్డి ఆధ్వర్యములో నిర్మల్ డిపో ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారం తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం రోజు ఆర్టీసీ ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్ సొలొమాన్ సందర్శించారు.ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబ సభ్యుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకొన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ ఆరోగ్యం గా ఉంటుందని అన్నారు. ఉద్యోగుల సతీమణులకు ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. అందుకోసమే మీరు ఆరోగ్యంగా ఉండండమే కాకుండా మీ భర్తల ఆరోగ్యం కాపాడండని సూచించారు. ఈ కార్యక్రమoలో డిపోమేనేజర్ ప్రతిమా రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ ఐ. రాజశేఖర్, ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.