ప్రధాని మోదీ 12 సంవత్సరాల పదవి కాలాన్ని పురస్కరించుకొని పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. నాగ మోహన్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు అమ్మ పేరుతో మొక్కలు నాటాలని సూచించారు. ఆయన మొక్కలు నాటడం ద్వారా రాబోయే తరాలకు గొప్ప ఆస్తిని అందిస్తున్నారని చెప్పారు.
మొక్కలు నాటడం వల్ల ఆక్సిజన్ పుష్టిగా లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, కార్పొరేటర్లు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.



