నందిపేట్ మండలంలో సంచలనం సృష్టించిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షలతో కత్తులతో దాడి చేసిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
రాజ్‌నగర్‌కు చెందిన షేక్ నయీమ్(30)పై ఆదివారం క్యారంబోర్డ్ షాప్ వద్ద కత్తులు, ఇనుపరాడ్లతో దాడి జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నయీమ్‌ను స్థానికులు నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వాహన తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించినట్లు ఎస్సై కే. వినయ్ తెలిపారు.
అరెస్టయిన వారిలో షేక్ తాహెర్, షేక్ తాలిబ్, షేక్ గాలిబ్ అలియాస్ హమీద్ (నందిపేట్), సయ్యద్ అబ్దుల్ హలీం, ఎస్కే ఫజల్ (కామారెడ్డి) ఉన్నారు. వీరి నుంచి నాలుగు ఇనుపరాడ్లు, ఒక కత్తి, రెండు మోటార్‌సైకిళ్లు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారిని రిమాండ్‌కు ఆదేశించింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.











