Headlines:
-
గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి విద్యార్థులకు రాత్రి గ్రంథాలయ సమయం పొడిగింపు
-
గ్రూప్ 2 అభ్యాసకుల కోసం 45 రోజుల భోజన వసతి కల్పించిన ఏలుగంటి మధుసూదన్ రెడ్డి
-
విద్యార్థుల అభ్యర్థనపై రాత్రి 12 వరకు గ్రంథాలయాన్ని తెరిచిన గ్రంథాలయ చైర్మన్
రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ కార్యాలయంలో మంగళవారం గ్రూప్ 2కు సిద్ధమవుతున్న 120 మంది విద్యార్థులు జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏలుగంటి మధుసూదన్ రెడ్డికి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి విన్నపించారు..రాత్రిపూటి పది గంటల వరకే గ్రంథాలయం సమయం ఉన్నందున నమయం సరిపోవడం లేదని మరియు అదేవిధరణా మాకు భోజన వసతి కల్పించాలని కోరుతూ విద్యార్థులు చైర్మన్‌కి విజ్ఞప్తి చేయడం జరిగంది. విద్యార్థులు యొక్క విజ్ఞప్తి మేరకు ఛైర్మెన్ సానుకూలంగా స్పందించి రాత్రి సమయం 10-00 గంటల నుండి 12-00 వరకు ,2 గంటలు అదనంగా గ్రంథాలయం తెరిచి ఉంటుందని మరియు గ్రూప్ 2కు సిద్ధమవుతున్న 120 మంది విద్యార్థుల కు 45 రోజుల వరకు భోజనం తన వ్యక్తిగత సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి మనోజ్ కుమార్ ,గ్రంథాలయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు