నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే : 21
ఆర్మూర్: TNGO’s Armoor | ఉద్యోగుల పక్షాన టీఎన్జీవోస్ నిరంతర పోరాటం చేస్తుందని జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్(TNGO’s Nizamabad) అన్నారు. ఆర్మూర్ యూనిట్ కార్యాలయంలో బుధవారం యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు కుంట శశికాంత్ రెడ్డి, విశాల్ అధ్యక్షతన మొదటి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్త ఉద్యోగుల సమస్యలపై నిరంతరం స్పందిస్తూ పరిష్కరిస్తున్నామన్నారు. అనంతరం పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు అతిక్, నాయకులు దినేష్ బాబు, మారుతి, సృజన్ కుమార్, వనమాల సుధాకర్, స్వామి, మచ్చేందర్, లయన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.