ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అర గ్యారంటీ మాత్రమే అమలు చేస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు.

షాబాద్లో చేపట్టిన రైతు ధర్నాలో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో.  కౌశిర్రెడ్డి, నవీన్రెడ్డి, నరేందర్రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, సబితారెడ్డి, కార్తీ త్రెడ్డి, అంజయ్యయాదవ్ తదితరులు

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 18.

తెలంగాణను పట్టించుకోని వ్యక్తి.. ఢిల్లీని ఉద్ధరిస్తారా? షాబాద్ రైతు ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై కేటీఆర్ ధ్వజం రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్. 

ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అర గ్యారంటీ మాత్రమే అమలు చేస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. రైతుల కోసం ఎన్ని పోరాటాలైనా చేస్తామని, ప్రభుత్వం తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని ప్రకటించారు. రైతాంగ సమస్యలపై రంగారెడ్డి జిల్లా షాబాద్లో శుక్రవారం నిర్వహించిన రైతు ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణను పట్టించుకోని వ్యక్తి.. దిల్లీని ఉద్ధరిస్తారా అని ప్రశ్నించారు. ఢిల్లీలో కాంగ్రెస్ను గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేశానంటూ సీఎం అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అంతకుముందు సభలో కుమ్మరిగూడకు చెందిన మహిళ చెన్నమ్మ తనకు రూ.54 వేల వ్యవసాయ రుణం ఉంటే అది మాఫీ కాలేదని, తనకు గ్యాస్ బుడ్డి పై రాయితీ రూ.500 రావడం లేదని తెలిపిన విషయాన్ని కేటీఆర్ ఉటంకిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వ మాటలన్నీ గ్యాస్ అని అన్నారు. ఎవరైనా మాటిచ్చి తీర్చకుంటే వారిపై 420 కేసు పెడతామని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!