తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 1.
ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం చల్పాక అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి.మృతుల్లో మావోయిస్టు కీలక నేతలున్నట్లు సమాచారం. ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి భద్రు అలియాస్ పాపన్నతో పాటు అతడి దళ సభ్యలు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో కురుసం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న (35), ఎగోలపు మల్లయ్య అలియాస్ మధు(43), ముస్సకి దేవల్ అలియాస్ కరుణాకర్(22), ముస్సకి జమున (23), జైసింగ్ (25), కిశోర్ (22), కామేశ్( 23) ఉన్నట్లు సమాచారం.