నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి13.
స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థుల ఆటోలో బోల్తా పడింది. ఈ ఘటన నగరంలోని సుభాష్ నగర్ లో జరిగింది.వివరాల్లోకి వెళ్ళితే..
నగరంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ లో ఆరవ తరగతి చదువుతున్న షేక్ హైమద్, వినిత్ నంద లతో పాటు మరి కొందరు విద్యార్థులు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే క్రమంలో ఒక్కసారిగా ఆటో బోల్తా పడింది.దీంతో షేక్ హైమద్, వినిత్ నంద లకు గాయాలయ్యాయి.స్థానికుల గమనించి హుటాహుటిన నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఆటోవాలాలు తమ ఇష్టారాజ్యంగా చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని పలువురు స్థానికులు వాపోయారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఆర్టిఏ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు.