భీoగల్ పోలీస్ స్టేషను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:17

నేడు నిజామాబాద్  పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య, ఐ.పి.యస్  భీoగల్ పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించడం జరిగింది. 

ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ గారు పోలీస్ స్టేషన్ మొత్తం కలియ తిరిగి పోలీస్ స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రిసిప్షన్ సెంటర్ పనితీరును కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.  5S విధానం అమలు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకొని మొత్తం చూసారు.రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ప్రధానంగా ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనాదారులకు జరుగుతున్నందున, తప్పనిసరి హెల్మేట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు.గంజాయి నిర్మూలనకు అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగిందని, ఎవరయిన గంజాయికి బానిస అవుతే వారికి కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు , దాని నిర్మూలనకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.సైబర్ మోసగాండ్ల నుండి ప్రజలు మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.గెమింగ్ అప్ ల పట్ల ప్రజలు మోసపోకుండా ఎప్పటికప్పుడు వారికీ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిoచాలని అన్నారు. సిబ్బoది సాధక బాధలు ప్రతీ ఒక్కరిని అడిగి తెలుసుకొనరు.ఈ సందర్బంగా ఆర్మూర్ ఏ.సి.పి  వెంకటేశ్వర్లు, ఆర్మూర్ రూరల్ సి.ఐ.   శ్రీధర్ రెడ్డి, భీంగల్ సి.ఐ.  సత్యనారాయణ, భీoగల్ ఎస్.ఐ  జి.మహేష్, కమ్మర్పల్లి ఎస్.ఐ   జి.అనిల్ కుమార్ ,ఎర్గట్ల ఎస్.ఐ  రాము, మోర్తాడు ఎస్.ఐ  విక్రమ్. మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!