నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 18.
తప్పుడు పత్రాలతో అమాయక ప్రజల భూములను కబ్జా చేస్తున్న భూ కబ్జా ఖోరులు.
నిజామాబాద్ నగరంలో నాగారం శివారులోనీ 2164 సర్వే నంబర్ గల భూమిని అధికారులు ఇచ్చిన తప్పుడు నివేదికలపై కబ్జా చేస్తున్నారని బాధితులు జమీర్ ఉద్దీన్, సాలం చౌష్ అనే వ్యక్తులు ఆరోపించారు. నాగారం శివారులోని ప్రముఖ మైనార్టీ విద్యా సంస్థ ప్రక్కన గల భూమిని పది సంవత్సరాల క్రితం తమకు మరియు సయ్యాద్ ఖమర్ భానుకు ప్రభుత్వం కేటాయించింది ఆన్నారు. అయితే పాతిక సంవత్సరాల నుంచి దానిని తామే అనుభవిస్తున్నామని తెలిపారు. కొంతమంది భూ కబ్జా ఖోరులు తప్పుడు పత్రాలను సృష్టించి తమ వెనుక పై అధికారుల హస్తము ఉందని ప్రాణాలపై ఎలాంటి ప్రేమ ఉన్న ఇటువైపు రావద్దని బెదిరిస్తున్నారని జమీరుద్దీన్, సాలాం చౌశ్, వాపోతున్నారు. ఇటీవల రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారులు గతేడాది సర్వే నంబర్ ను వేరే నంబర్ భూమి అక్కడ ఉందని తప్పుడు రిపోర్టులు ఇచ్చారని తెలిపారు. సంబంధిత భూమి ప్రభుత్వ భూమిని మార్చి ప్రైవేట్ పట్టా భూమిగా చూపడం దారుణమన్నారు. అంతేకాకుండా అటవిశాఖకు ఎన్ ఓ సి దరఖాస్తు చేసిన ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ సంబంధిత భూమిని కబ్జా చేయడం దారుణమని వాపోతున్నారు. అధికారుల అవినీతిపై, అక్రమాలపై జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సంబంధిత భూమిలో ఎలాంటి అనుమతులు లేకున్నా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఈ విషయంపై తహసీల్దార్ తో పాటు మున్సిపల్ కమిషనర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.