నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే :22 (షేక్ గౌస్)
నిజామాబాద్ జిల్లా కేంద్రం లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో జోన్-4 పరిధిలో నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు.
సమావేశం లో అధికారులకు పలు సూచనలు చేసిన అనంతరం గౌతమ్ నగర్, ఆదర్శ్ నగర్, కలెక్టరేట్ బైపాస్, గుమస్తా కాలనీ, శ్రద్ధానంద్ గంజ్, గంజ్ వెజిటబుల్ మార్కెట్ నుంచి అర్సపల్లి ట్రాక్ వరకు, బోధన్ రోడ్, డి-54, డి-52 కాలువలు వంటి వర్షానికి ప్రభావిత ప్రాంతాల్లో తనిఖీ చేశారు.నీరు అ నిలిచిన ప్రాంతాలను చూసి, సంబంధిత శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు వెంటనే నీరు తొలగించాలని ఆదేశించారు.పట్టణవ్యాప్తంగా ఇంటింటి చెత్త సేకరణ, చెత్త తొలగింపు, కాలువల శుభ్రత, సిల్ట్ తొలగింపు పనులు చేస్తూ పర్యవేక్షించాలి అని ఆదేశించారు.చెత్త ఉన్న చోట బ్లీచింగ్ పౌడర్ వేసి. దోమలు తగ్గించేందుకు రెగ్యులర్‌గా ఫాగింగ్ చేయాలని తాకిదు చేశారు.నీరు నిలిచిన ప్రాంతాలను గుర్తించి, జేసీబీ సహాయంతో నీరు వెళ్లే మార్గాలు తవ్వించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశారు .ఈ తనిఖీలో మున్సిపల్ ఈఈ , హెల్త్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్లు, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.