నిజామాబాదు జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 7.
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో గ్రామీణ ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తుంది అని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు అంకాపూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోసం స్టల పరిశీలన చేశారు. చిన్న చిన్న చికిత్సలకు వైద్యం పొందడానికి సులువుగా ఉంటుంది అని చుట్టుపక్కల ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది అని అతి త్వరలో ఆరోగ్య కేంద్రానికి నిధులు మంజూరు అవుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి హరిక, మండల సర్వేయర్ రత్నాకర్, అర్ ఐ దశరథ్ తదితరులు పాల్గొన్నారు.