నిజామాబాద్ జై భారత్ జూలై 20 : హమాల్ వాడి ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు ఎల్ల బోయిన నర్సింలు తాను రాజీనామా చేయడం వలన ముదిరాజ్ సంఘం సభ్యులు ఆదివారం మధ్యాహ్నం సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేరుమటి రాజు ను సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో నేరుమటి రాజు సంఘం కోశాధికారిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించారని యువతకు బాధ్యతలు అందించాలని సంఘం మాజీ అధ్యక్షులు ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ సందర్భంగా నేరుమటి రాజు మాట్లాడుతూ తనపై ఉంచిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని దానికి సంఘం సభ్యులు అందరూ సహకరించాలని కోరారు. ఇదే సందర్భంగా కోశాధికారిగా గడ్డం శ్రీకాంత్, సెక్రటరీగా శ్రీనివాసు, ఎన్నుకోబడ్డారని ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నేరుమాటి రాజు తెలియజేశారు.
హమాల్ వాడి ముదిరాజ్ సంఘం ఎన్నికలు ఏకగ్రీవం–అధ్యక్షుడిగా నేరుమటి రాజు ఎన్నిక
Published On: July 20, 2025 8:07 pm
